హైదరాబాద్ : దుమ్ము రేపే సీన్స్ తెరపైనే కాదు...తెరవెనక మహేష్ చేస్తున్నాడు. చాలా దుమ్ము,ధూళితో నిండిన బళ్లారి మైనింగ్ ఏరియాలో ఆయన రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారు. ఈ విషయమై యూనిట్ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు శ్రీను వైట్ల... మహేష్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన ట్వీట్ చేస్తూ... బళ్లారి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాము. అంత దుమ్ముతో ఉన్న పరిస్దితుల్లోనూ ఎక్కడా సూపర్ స్టార్ తన ముఖంపై చిరునవ్వు మెయింటైన్ చేస్తూ, ఎనర్జీని,గ్లామర్ ని ఎక్కడా కోల్పోకుండా మెయింటైన్ చేసారు అన్నారు. మహేష్‌బాబు, తమన్నా జంటగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర రూపొందిస్తున్న ‘ఆగడు' చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ బళ్లారిలో పూర్తైంది. దూకుడు కాంబినేషన్‌తో మరోసారి వెండితెరపై శ్రీనువైట్ల మాయాజాలం చేయనున్నారు. అక్కడ మహేష్ పరిచయం పాట షూట్ చేసారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్స్‌ను చిత్రీకరించామని, మరో భారీ షెడ్యూల్ గుజరాత్‌లో చేయనున్నామని తెలిపారు. దూకుడులో బ్రహ్మానందం రియాల్టీషో వంటి మరో సరికొత్త కామెడీ ట్రాక్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ స్క్రిప్టు అందించారు. మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. సోనూ సూద్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో మహేష్ బాబు అక్క పాత్రలో కనిపించనుంది. నదియా, మహేష్ బాబు కలిసి నటించడం ఇదే తొలిసారి. సోనూ సూద్, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నెపోలియన్, నదియ ప్రధానపాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: థమన్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: శ్రీనువైట్ల.
Monday, July 7, 2014
మహేష్ బాబుని మెచ్చుకున్నాడు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment