విశాఖ వాసుల త్రాగునీటి కష్టాలను తీర్చడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు రూ. 1000కోట్ల ను మంజూరు చేశారు. ఈ నిధులతో విశాఖ పట్నం లో లవణ నిర్మూలణ ద్వారా దాదాపు 100 మిలియన్ లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే వాటర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు మరిన్ని కేంద్ర నిధులు సమకూర్చుకునేలా మున్సిపల్ సిబ్బంది మరియు పట్టాణాభివృద్ది శాఖ అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు.
గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ అమలుకు మొగ్గు చూపినప్పటికీ, కొన్ని కారణాల రిత్యా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయటం ద్వారా గ్రేటర్ విశాఖ పట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని ప్రజల దాహార్తిని తీర్చి, విశాఖ పట్నం కీర్తిని మరింత పెంపొందించడానికి అధికారులు కృషి చేస్తామని చెబుతున్నారు. కాగా విశాఖ పట్టణ ప్రజలకు రోజుకు 80 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం అవుతుండగా అధికారులు 60 మిలియన్ గ్యాలన్ల కంటే తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారు.
No comments:
Post a Comment