Monday, July 7, 2014

సికింద‌ర్ పాట‌లు వినిపిస్తాడు



సూర్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘అంజాన్’. తెలుగులో ‘ సికింద‌ర్ ’ పేరుతో విడుదల చేస్తున్నారు. లింగుస్వామి ద‌ర్శ‌కుడు. తెలుగు హ‌క్కుల్ని ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఫ్యాన్సీ రేటుతో ద‌క్కించుకొన్నారు. యువ‌న్ శంక‌ర్‌రాజా స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఈనెల 17 న త‌మిళ ఆడియో విడుద‌ల కాబోతోంది. తెలుగులో మాత్రం కాస్త ఆల‌స్యంగా పాట‌లు వినిపిస్తాయి. తెలుగులో ఆడియో విడుదల ఈ నెల 23న జరగనుంది. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. సూర్య‌కి గత కొంత‌కాలంగా తెలుగులో విజయాల్లేవు. సింగం 2 ఓ మాదిరిగా ఆడింది. ప్ర‌యోగాల‌న్నీ భారీగా బెడ‌సికొట్టాయి. అందుకే ఈసారి పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమాని ఎంచుకొన్నాడు. సికింద‌ర్‌లో సూర్య డాన్ గా క‌నిపించ‌నున్నాడు. త‌న‌కు అల‌వాటైన వివిధ‌ర‌కాల గెట‌ప్‌ల‌ను వేయ‌బోతున్నాడు. ఈ వేషాలైనా ఈ సినిమాని హిట్ చేస్తాయ‌ని అతని ధీమా. మ‌రి ఏమ‌వుతుందో??

No comments:

Post a Comment