సమంత నిజంగానే అల్లరి పిల్ల. తెరపై ఎంత సరదాగా ఉంటుందో బయటా అలానే అల్లరి చేస్తుంది. శుక్రవారం ‘లవర్స్’ ఆడియో ఫంక్షన్ కి హాజరైంది. అక్కడా తన అల్లరి చూపించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన త్రివిక్రమ్ ని యాంకర్ సుమ చేత రెండు ప్రశ్నలు అడిగించింది.
1. ప్రేమంటే ఏమిటి?
2. ఇష్టమైన లవ్‌స్టోరీ ఏదీ?
ఈ రెండింటికీ త్రివిక్రమ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. “ప్రేమంటే ఏమిటో నాకంటే సమంతకే బాగా తెలుసు. నా గడ్డం నెరిసిపోయింది. తను చెబితే వింటా“ అన్నారాయన. ఆల్రెడీ సిద్దార్ద్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది కదా, అందుకే ఆ డైలాగ్ కొట్టి ఉంటారు. ఇక త్రివిక్రమ్‌కి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా…?? నాగార్జున – మణిరత్నంల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ… గీతాంజలి.
No comments:
Post a Comment