పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ 2 ప్రీ పొడక్షన్ పనులు స్పీడందుకొన్నాయి. గోపాల గోపాల తరవాత.. వెంటనే గబ్బర్ సింగ్ 2 సెట్స్‌పైకి తీసుకెళ్లాలి. అందుకే… స్టార్ కాస్టింగ్, టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో పడింది చిత్రబృందం. కథానాయికగా కాజల్‌ని ఎంపిక చేసుకొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం ముందుగా కాజల్‌నే సంప్రదించారు. అప్పట్లో… కాల్షీట్లు కుదరకపోవడం వల్ల కాజల్ నో చెప్పింది. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం తనకే వరించడంతో… ఓకే చేసేసింది. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో కలసి నటించిన కాజల్‌కి… పవన్‌తో జత కట్టడం ఇదే తొలిసారి. అయితే కాజల్ ఎంపికపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సివుంది.
No comments:
Post a Comment