వెంకటేష్, మీనా జంటగా సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’. సురేష్ ప్రొడక్షన్స్ – రాజ్ కుమార్ థియేటర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న విడుదల కానున్న సోమవారం ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుంది. వెంకటేష్ తొలిసారిగా ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు.
‘రాముడు భీముడు’ సినిమాలో ఒక హిట్ సాంగ్ ను ‘దృశ్యం’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్లో ఉపయోగించడం జరిగిందట. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలలో ‘రాముడు భీముడు’ది ప్రత్యేకమైన స్థానం. సురేష్ ప్రొడక్షన్స్ 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంలో ‘రాముడు భీముడు’ పాటను ఉపయోగించడం విశేషం.
మలయాళంలో ఘన విజయం సాదించిన ‘దృశ్యం’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ ‘దృశ్యం’ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్ కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఇటివల విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలుగజేసింది.
No comments:
Post a Comment