Monday, July 7, 2014

గోపీచంద్ సరసన రాశి ఖన్నా..?


‘మనం’ చిత్రంలో అతిధి పాత్రలో మెరిసి.. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ముంబై ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో తన నటనతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయం రెండిటిలో అమ్మడు అదరహో అనిపించడంతో అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. తాజాగా తెలుగులో రాశి ఖన్నాకు మరో అవకాశం లభించినట్టు సమాచారం.
గోపీచంద్ హీరోగా యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్’గా రాశి ఖన్నాను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్టైలిష్ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

No comments:

Post a Comment