ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. రైల్వే, సాధారణ బడ్జెట్ల ఆమోదంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. వీటితో పాటు పోలవరం ఆర్డినెన్సు కు చట్టరూపాన్నిచ్చే బిల్లును కూడా ప్రవేశపెట్టబోతోంది. సమావేశాలు వచ్చే నెల 14 వరకు కొనసాగుతాయి. ధరల పెరుగుదల, రైల్వే చార్జీల పెంపు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని వివిధ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌సభలో మంగళవారం రైల్వే బడ్జెట్‌ను, 9న ఆర్థిక సర్వే నివేదికను, 10న సాధారణ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ సవరణ ఆర్డినెన్సుపై బిల్లును కూడా లోక్‌సభలో ప్రవేశ పెడతారు. నరేంద్ర మోడీ ప్రభు త్వం ప్రవేశపెట్టనున్న తొలి బిల్లు ఇదే. దీనిని తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతా దళ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమోదం పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలు ఉన్న ఈ బిల్లు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ మద్దతుతో పార్లమెంటు ఆమోదం పొందుతుందని ధీమాగా ఉంది. భద్రాచలం డివిజన్‌లోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడంపై టీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోల వరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితుల సమస్యపై బీజేడీ ఆందోళన తెలుపుతోంది. లోక్‌సభలో ఎన్డీయేకు 330కి పైగా ఎంపీల మద్దతు ఉంది. దీంతో ఈ ఆర్డినెన్సు చట్టంగా మారుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
పార్లమెంటు సమావేశాల్లో సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లను ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై చర్చకు సుముఖమేనన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్‌లోని భారతీయుల పరిస్థితిపై ప్రకటన చేస్తారని తెలిపారు. ఉభయ సభల సమావేశాలు సజావు గా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. ఆగస్టు 14 వరకు నెల పాటు పార్లమెంటు సమావే శాలు జరుగుతాయి. ధరల పెరుగుదల, రైలు చార్జీల పెంపు, తమిళ జాలర్ల దుస్థితి తదితర అంశాలపై సభలో చర్చిం చాలని వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై ప్రశ్నలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సమాధానం స్పష్టం గా ఇచ్చినట్లే ఉంది. తాను ఏర్పాటు చేసిన సమావేశం సభలో కార్యకలాపాలపై చర్చించేందుకేనని తెలిపారు. ఈ సెషన్‌లో 28 సిట్టింగ్‌లు, 168 పని గంటలు ఉంటాయన్నారు.
No comments:
Post a Comment