నందమూరి బాలకృష్ణ అటు రాజకీయ నేతగా, మరోవైపు తన అభిమానులను అలరించే నటుడిగా, తనపై ఉన్న రెండు బాధ్యతలను కరెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఆర్.ఎఫ్.సి లోని ఫ్లెక్స్ హౌస్ లో బాలకృష్ణ – ప్రముఖ నటీనటులపై కొన్ని కామెడీ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అలాగే మరోవైపు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా షూట్ చేస్తున్నారు.
చాలా రోజుల తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ ఎమ్మెల్యే గా కూడా బిజీగా ఉండడం వల్ల ఆయన డేట్స్ ఉన్నన్ని రోజులు శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతానికి ‘గాడ్సే’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ నాయకుడిగా కనిపించనున్నాడు. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.
No comments:
Post a Comment