ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సర్వసభ్య సమావేశం నేడు ఫిలిం ఛాంబర్ లో జరిగింది …ఈ కార్యక్రమం లో సినిమా పరిశ్రమ ఎందుకు రెండుగా విడి పోవాలో దాని ఆవశ్యకత ఏమిటో తెలంగాణా ప్రతినిధులు వివరించారు.
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వి భజన లోని ప్రతి అంశం లో తెలంగాణా కోణం నుండి అలోచించి అనుకూల నిర్ణయాలే తీసుకో వాలనే పద్దతిలో సినిమా పరిశ్రమ రెండుగా విడిపోయి కలిసి పని చేసుకోవచ్చు అని వారు వివరించారు. విభజన ప్రక్రియ స్పష్టంగా త్వరిత గతిన జరగాలని తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముక నిర్మాత దిల్ రాజు సబ్యుల కర తాళ ద్వనుల మధ్య తన వాని వినిపించారు ఆయన అభిప్రాయం తో ఏకీభవిస్తూ ..తెలంగాణా నిర్మాతల సంఘం అధ్యక్షుడు సాన యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఏర్పరహిన విభజన సిద్ధాంతం ఆదారంగా సినిమా పరిశ్రమను కోద్ద విభజించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన రీతి గానే సినిమా పరిశ్రమ కూడా ఇది పోవలసిన అవసరం ఉందని అన్నారు . తెలంగాణా దర్శకుల సంగం అద్యక్షులు అలలని శ్రీధర్ మాట్లాడుతూ సామరస్య పూర్వకంగా తెలుగు సినిమా పరిశ్రమ విభజన జరిగితే అందరు కలిసికట్టుగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది అని తెలంగాణాకు సినిమా ప్రపంచంలో గుర్తింపు వస్తుందని ..హైదరాబాద్ అయిదు భాషలసిని మాలకు ఒక హబ్ గా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు ..ఇప్పుడు అందం కలిసివుండము అని అంటున్న పెద్దలు తెలంగాణా ఫిలిం ఛాంబర్ ను ఎందుకు కలుపుకు పోలేదని తెలంగాణా నిర్మాతల సంగం ప్రధాన కార్యదర్శి సంగ కుమార్ అన్నారు.ప్రస్తుతం సమయ ఉన్నందున ఇరు ప్రాంతాల సినిమా పెద్దలు కుర్చుని స్మరస్యంగా సినిమా పరిశ్రమను విభజించాలని తెలంగాణా సినిమా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి ఫిలిం ఛాంబర్ వారు సానుకూలంగా స్పందించారు ….ప్రస్తుతం ఉన్న ఛాంబర్ పేరును తెలుగు ఫిలిం ఛాంబర్ గా మార్చాలన్న ప్రతిపాదన కు అత్యవసరంగా చేయవలసిన ఆవశ్యకత లేదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు సి.కళ్యాన్ , ప్రసన్న కుమార్ లు అభిప్రాయ పడ్డం తో సభ వాయిదా పడింది …
No comments:
Post a Comment