Monday, July 7, 2014

రైళ్ళలో ఎక్కువైన టికెట్ లేని ప్రయాణాలు




రైళ్ళలో టికెట్ లేని ప్రయాణాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ సంవత్సరంలో మొదటి త్రైమాసికం లో దక్షిణ మధ్య రైల్వే టికెట్ లేకుండా రైళ్ళలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి దాదాపు రూ. 24 కోట్ల రూపాయలను జరిమానా రూపం లో రాబట్టుకుంది. ఇది గత సంవత్సరం 2013 తో తొలి త్రైమాసికం తో పోల్చుకుంటే దాదాపు 17 శాతం ఎక్కువ.
2014 ఏప్రిల్, జూన్ మధ్య కాలం లో రైల్వే సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో ఈ అంశంపై దాదాపు ఏడున్నర లక్షల కేసులను నమోదు చేశారు. ఈ కేసుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై దాదాపు 2 లక్షల 22 వేల కేసులు నమోదు చేయగా, ప్రయాణం లో టికెట్ లేకుండా తమ పిల్లలను పెద్దలు వారి వెంట తెచ్చుకోవటం, ఒకరి టికెట్ తో మరొకరు ప్రయాణించడం మొదలైన వంటి ఘటనల్లో దాదాపు 2 లక్షల 83 వేల కేసులను రైల్వే సిబ్బంది నమోదు చేసుకున్నారు. ఇక తమతో పాటు ప్రయాణం లో తెచ్చుకున్న బుక్ చెయ్యని లగేజీపై 2 లక్షల 45 వేల కేసులను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది నమోదు చేసారు.

No comments:

Post a Comment