Monday, July 7, 2014

ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడికి ‘తిక్క‌రేగితే..’??


కందిరీగ‌తో మాస్‌ని ఆక‌ట్టుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్‌. ఆ సినిమాతో ఏకంగా ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకొన్నాడు. ర‌భ‌స కాస్త ఆల‌స్య‌మ‌వుతున్నా… ఆ సినిమాపై చెప్ప‌లేనంత క్రేజ్ ఉంది. ర‌భ‌స విడుద‌ల‌కాక‌మునుపే…. ఈ యువ ద‌ర్శ‌కుడికి ఆఫ‌ర్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడీ ద‌ర్శ‌కుడు మ‌రో మాసీ స‌బ్జెక్ట్ రెడీ చేసుకొన్నాడు. దానికి ‘తిక్క రేగితే’ అనే మాస్ టైటిల్ పెట్టాడు. ఈ సినిమా కూడా త‌న‌కు తొలి, మ‌లి అవ‌కాశాలు ఇచ్చిన బెల్లంకొండ సురేష్ బ్యాన‌ర్‌లో చేస్తాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచార‌మ్‌. బెల్లంకొండ త‌న త‌న‌యుడు శ్రీ‌నివాస్ తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తాడా?? లేదంటే మ‌రో హీరోని ఎంచుకొంటాడా?? అన్న‌ది తేలాల్సివుంది.

No comments:

Post a Comment