Sunday, July 6, 2014

ఏడు కోట గోడల భారీ సెట్‌లో ‘గోనగన్నారెడ్డి’


అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలోని గోనగన్నారెడ్డి పాత్రను స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర చిత్రీకరణ ఈరోజు జూలై 4న హైదరాబాద్‌లోని గోపనపల్లిలో పద్మశ్రీ తోట తరణి సారధ్యంలో వేసిన ఏడు కోట గోడల భారీ సెట్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్‌ మాట్లాడుతూ ` ‘‘ఈరోజు గోనగన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ ప్రారంభించాం. పద్మశ్రీ తోట తరణిగారు వేసిన ఏడు కోట గోడల అద్భుతమైన సెట్‌లో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌తో చిత్రీకరణ ప్రారంభించాం. అల్లు అర్జున్‌తోపాటు వందలాది జూనియర్‌ ఆర్టిస్టులతో 40 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తోపాటు అనుష్క, రానా, ప్రకాష్‌రాజ్‌, కృష్ణంరాజు, హంసానందిని ఇంకా చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారు.  గోనగన్నారెడ్డి అల్లు అర్జున్‌ సరసన నటిస్తున్న కేథరిన్‌ త్రిసా కూడా పాల్గొంటారు. 40 రోజుల పాటు అల్లు అర్జున్‌ పాల్గొనే ఈ షెడ్యూల్‌తో ‘రుద్రమదేవి’ దాదాపుగా పూర్తవుతుంది. గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అద్భుతంగా సెట్‌ అయ్యారు. ఈ సన్నివేశాల్ని చాలా లావిష్‌గా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిస్తున్నాం. ‘రుద్రమదేవి’ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్ర స్పెషల్‌గా వుంటుంది. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏకధాటిగా షూటింగ్‌ జరుపుతున్నాం’’ అన్నారు.

No comments:

Post a Comment