రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్యాక్రాంతమైన భూములపై ప్రధానంగా దృష్టిపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ శివారు ప్రాంతాల్లో పరిశ్రమల పేరుతో ప్రభుత్వం నుంచి కారు చౌకగా భూములను తీసుకుని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉన్న వాటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే అయ్యప్ప సొసైటీలో అక్రమాలపై కొరడా ఝులిపించిన కేసీఆర్ ఆతర్వాత రంగారెడ్డిజిల్లా గోపన్ పల్లిలో ఏపీఎన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. గత సర్కార్ నుంచి భూములు పొందిన ఎన్జీవోలు.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంది. ఎన్జీవోల భూములు ఉన్న ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన 40ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 19 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. పద్మాలయ, సురేష్ ప్రొడక్షన్స్ మాత్రమే నిర్మాణాలు చేపట్టగా మిగిలినవారు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇప్పుడు ల్యాంకో హిల్స్ భూములపైనా సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వక్ఫ్‌బోర్డ్ భూములు ఆక్రమణకు గురైనట్లు భావిస్తున్న ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరించేపనిలో పడింది. కోఠిలోని ఈఎంటీ ఆస్పత్రి భూములు కబ్జాకు గురవ్వడంపైనా సీరియస్‌గా ఉంది.
మొత్తం మీద శివారు ప్రాంతాల్లో కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారీగా ఆదాయం పొందాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
No comments:
Post a Comment