Tollywood Cinema
సినిమాస్ గోస్సిప్స్, రివ్యూస్, రాజకీయాలు..
Monday, July 7, 2014
ఇదే ఊపు రిలీజ్ అయ్యాక కూడా ఉంటే...
హీరోను లాంచ్ చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదే ఏ హీరో కుమారుడో అయితే రిలీజ్ కు ముందే ప్యాన్స్ తో క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే నిర్మాత కుమారుడు లాంచ్ అవుతున్నాడంటే మనం వదలిన ప్రోమోలు, పాటలు, పోస్టర్స్ ని బట్టే సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. తాజాగా బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతూ అల్లుడు శ్రీను చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం ప్రోమోలు, ఆడియో విడుదల అయ్యాక బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడినట్లు సమాచారం. ఆ మేరకు బెల్లంకొండ సక్సెస్ అయినట్లే అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక...కుర్రాడి ఫెరఫార్మెన్స్ ని బట్టి మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి. జీవితంలో ఎదగాలంటే రిస్క్ చేయాల్సిందే అనేది ఆ కుర్రాడు నమ్మిన సిద్ధాంతం. మరి అతను ఎదిగేందుకు ఎలాంటి సాహసాలు చేశాడో తెరపైనే చూడాలంటున్నారు వి.వి.వినాయక్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అల్లుడు శీను'. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. సమంత కథానాయిక. తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించింది. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. ఈ నెల 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''శీను అనే కుర్రాడి కథ ఇది. అతను అల్లుడు శీనుగా ఎలా..ఎందుకు మారాడో తెరపై చూడాలి. వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. బ్రహ్మానందం, శ్రీనివాస్‌ల మధ్య సన్నివేశాలు సందడిగా సాగుతాయి. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. దేవిశ్రీప్రసాద్ మరోసారి తనదైన శైలిలో హుషారైన గీతాలను అందించారు'' అన్నారు. ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.
రామ్ చరణ్ ని అత్తగారు అడుగుతున్నారట
మీడియాకు దూరంగా మసిలే రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ తన అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ...'గోవిందుడు..'లో పోనీటైల్‌తో కనిపిస్తా. సినిమా అంతా ఈ గెటప్‌లోనే ఉంటా. తెరపై చూసుకొంటుంటే పిలక చాలా బాగుందనిపించింది. ఇంట్లోవాళ్లు మాత్రం... పిలకను చూసి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా అత్తమ్మ 'ఆ పిలక ఎప్పుడు తీసేస్తారు చరణ్' అని అడుగుతుంటారు అంటూ నవ్వుతూ చెప్పారు రామ్ చరణ్.'గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం ముస్తాబవుతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తన తాజా చిత్రం గురించి చెప్తూ.... కృష్ణవంశీ సినిమా అంటే.. హంగామా ఏ రేంజులో ఉంటుందో తెలిసిందే. సెట్లో కనీసం 40మంది నటీనటులుంటారు. మాస్, యాక్షన్ సినిమాలు చేస్తూనే ఉన్నా. కుటుంబ బంధాలతో సాగే కథలో కనిపించాలని చాలా రోజుల నుంచి అనుకొంటున్నా. నటుడిగా నాకూ కొత్త పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ మధ్యే ఓ పాట తెరకెక్కించాం. అందులో నా గెటప్ కాస్త షాకింగ్‌గా ఉంటుంది. ఆ ఫొటోల్ని త్వరలో విడుదల చేస్తాం. మేమంతా ఇంతింత అందంగా కనిపించడానికి కెమెరామెన్ సమీర్‌రెడ్డినే కారణం. నిర్మాత బండ్ల గణేష్ కూడా బాగానే ఖర్చుపెడుతున్నారు లెండి అన్నారు.
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' ఆగిపోయిందంటూ, కృష్ణ వంశీ ని తీసేస్తున్నారంటూ తెగ రూమర్స్ మీడియాలో వచ్చేసాయి. అయితే వాటిని గమనించినట్లున్నారు గోవిందుడు టీమ్. వెంటనే బండ్ల గణేష్ రంగంలోకి దిగి ఇండైరక్ట్ గా ఖండన లాంటి ప్రెస్ నోట్ ఇచ్చేసాడు. చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్ వచ్చారని చెప్పాడు. మలేషియా షెడ్యూల్ కాకుండా లండన్ లో సీన్స్ ఉంటాయని అన్నాడు. ఈ హడావిడి ప్రెస్ నోట్ చూసిన వాళ్లు మాత్రం ...సినిమా ఆగిపోలేదనేది నిజమే కానీ చిరంజీవి వచ్చి మార్పులు చేసాడనేది స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు. రామ్ చరణ్ కి ఒంట్లో బాగోలేదంటూ తీసుకున్న గ్యాప్ లో ఈ మార్పులు చేసేసారన్నమాట. ఇక ఈ చిత్రం కాన్సెప్టు ఏంటంటే... పల్లెటూరంటే... పచ్చదనం, తెలుగుదనం. మనవైన ఆప్యాయతలు, అనురాగాలూ అక్కడే కనిపిస్తాయ్. పిన్ని, పెద్దమ్మ.. బాబాయ్, నానమ్మ, తాతయ్య - ఎన్ని పిలుపులో. ఇంకెన్ని ఆప్యాయతలో. ఈ అరమరికలు లేని ఆనందాన్ని అనుభవించాలని విదేశాలనుంచి వచ్చాడో కుర్రాడు. కానీ... ఇక్కడి అనుబంధాలూ కలుషితమైపోయాయని అర్థమయ్యింది. మరి ఇలాంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దాడో, తాను కలలుకన్న ఉమ్మడి కుటుంబాన్ని తానే ఎలా నిర్మించుకొన్నాడో తెలియాలంటే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చూడాల్సిందే. శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.
సూర్య కూడా సింగేశాడు
తమిళ హీరో సూర్య ప్రస్తుతం సింగర్ గా కొత్త అవతారం ఎత్తాడు. తన లేటెస్ట్ చిత్రంలో ఓ పాట పాడుతున్నాడు. సూర్య మాఫియా డాన్ పాత్రలో రూపొందుతున్న సినిమా ‘అంజాన్’. లింగుస్వామి దర్శకుడు . సమంత హీరోయిన్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ పాట పాడడానికి అంగీకరించాడు సూర్య. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేయనున్నారు. ఇక, ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. తమిళ, హిందీ భాషలలో ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సుమారు 75 కోట్ల భారి నిర్మాణవ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్నితెరకెక్కించారు. తెలుగులో ఈ చిత్రం సికింధర్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
సూర్యతో ఛాన్స్..
అక్కినేని ఫ్యామిలీకి అదిరిపోయే హిట్ ను ఇచ్చిన దర్శకుడు విక్రం కుమార్. ‘మనం’తో అందరి మనసులను దోచుకున్నాడు. తాజాగా, విక్రమ్ మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. త్వరలో తమిళ స్టార్ హీరో సూర్యను డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవల, సూర్యకు ఓ కథను వినిపించాడు విక్రమ్. కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఇది ముగియగానే విక్రమ్ ప్రాజెక్ట్ ప్రారంభించినున్నట్లు కోలీవుడ్ సమాచార్. వెంకట్ ప్రభు కార్తీతో ‘బిర్యానీ’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Subscribe to:
Posts (Atom)